: రేపు రాత్రి కావలి వద్ద తీరం దాటనున్న తుపాను
హెలెన్ తుపాను ప్రమాదం ముంచుకొస్తోంది. రేపు రాత్రి కావలి వద్ద తుపాను తీరం దాటనుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీని తీవ్రత ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుందని వారు హెచ్చరించారు. కోస్తాంధ్రలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికల జెండా ఎగుర వేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.