: అండమాన్ దీవుల్లో భూకంపం 20-11-2013 Wed 16:42 | అండమాన్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3 గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంగా 277 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాగా భూకంపం కారణంగా జరిగిన నష్టంపై వివరాలు అందలేదు.