: మమతా బెనర్జీని కలిసిన వైఎస్ జగన్
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు. పార్లమెంటుకు రానున్న తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని మమతను జగన్ కోరారు. మమతను కలిసిన సమయంలో వైఎస్సార్సీపీ పార్టీ ముఖ్య నేతలు కొంతమంది జగన్ వెంట ఉన్నారు. సీబీఐ కోర్టు అనుమతివ్వడంతో ఈ ఉదయం జగన్ కోల్ కతా వెళ్లిన సంగతి తెలిసిందే.