: ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టు భిన్నాభిప్రాయాలు


ఏపీఎన్జీవోల సమ్మె చట్ట విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ పై కొద్దిసేపటి కిందట హైకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యమేనని కోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా, సమ్మె చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఇది రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యమని మరో న్యాయమూర్తి కేసీ భాను అన్నారు. దాంతో, కోర్టు తుది తీర్పు కోసం పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీచేసింది.

  • Loading...

More Telugu News