: పంటలెండుతున్నా సర్కారుకు కనికరం లేదు: బాబు


చేతికొచ్చిన పంటలు నీరు లేక ఎండిపోతుంటే ఈ సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన చెప్పారు.

సభను స్థంభింపజేస్తామని బాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్ మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. కరెంటు కష్టాలకు అప్పటి సీఎం రాజశేఖర రెడ్డే కారణమని బాబు ఆరోపించారు. ప్రస్తుత సీఎం వల్ల ఆ కష్టాలు రెట్టింపయ్యాయని దుయ్యబట్టారు. 

  • Loading...

More Telugu News