: 4 వేల మంది మృతి, 25 లక్షల మంది నిరాశ్రయులు
రెండు వారాల క్రితం ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన హయాన్ తుపాను మృతుల సంఖ్య నాలుగు వేలకు చేరినట్టు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను ధాటికి మరో 18 వేల మంది గాయపడ్డారని తెలిపింది. నిరాశ్రయులైన 25 లక్షల మందికి సహాయ సహకారాలు అందజేయడానికి యూఎన్ ఎయిడ్ కార్యకర్తలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి పెట్టిన ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ యూఎన్ ఎయిడ్ కార్యకర్తలతో కలసి బాధితులకు ఆహారం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.