: క్యాంపు కార్యాలయంలో సీఎంతో బొత్స భేటీ
త్వరలో జరగనున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ సీఎం కార్యాలయంలో భేటీ అయ్యారు. సీఎం, బొత్సలు ఆయా పేర్లను వడపోసి ఓ జాబితా తయారు చేస్తారని తెలుస్తోంది. ఆ జాబితాను రేపు సీఎం, బొత్స ఢిల్లీ తీసుకెళ్లి అధిష్ఠానం వద్ద ఆమోదముద్ర వేయించుకొస్తారు.