: ఇందిరాగాంధీ ఓ అద్భుత వ్యక్తి : లార్డ్ స్వరాజ్ పాల్
భారత మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ ఓ అద్భుత వ్యక్తి అని ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ కొనియాడారు. భారతీయుల గౌరవానికి ఇందిర ప్రతీక అని తెలిపారు. ఆమె వ్యక్తిత్వం అమోఘమైనదని అన్నారు. ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా లండన్ లోని నెహ్రూ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఇందిర ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1971లో భారత్, పాక్ ల మధ్య జరిగిన యుద్ధ సమయంలో ఇందిరపై మేరిలిన్ స్టాఫర్డ్ తీసిన ఫొటోలతో పాటు ఇందిర, రాజీవ్, సంజయ్ గాంధీ, సోనియాల ఫొటోలను ఆ ప్రదర్శనలో ఉంచారు.