: పాక్ లో ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్ లోని ఉత్తర వజీరిస్థాన్ లో బన్ను మీర్ అలీ రహదారిలో ష్వా చెక్ పోస్టు వద్ద ఈ రోజు ఉదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారని, మరో ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. అక్కడున్న పోలీసులు వెంటనే స్పందించి స్థానికుల సాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని అన్సరుల్ ముజాహిదీన్ ప్రకటించింది.