: చంఢీగడ్ కంపెనీలతో మీకు లింకేంటి?: అగస్టా కంపెనీని ప్రశ్నించిన రక్షణ శాఖ


హెలిస్కాం దర్యాప్తులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. చంఢీగడ్ సాఫ్ట్ వేర్ కంపెనీలైన ఐడీఎస్, ఏరోమాట్రిక్స్ లతో అగస్టా వెస్ట్ల్ లాండ్ సంస్థకు ఉన్న లావాదేవీలు వెల్లడించాలని రక్షణ శాఖ తాజాగా ఆదేశించింది. వారం రోజుల్లో వివరాలు అందించాలని గడువు విధించింది. ఈ రెండు సంస్థలకు భారత్ తో పాటు ట్యునిసియాలోనూ కార్యాలయాలున్నాయి.

కాగా, సీబీఐ నిన్న ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలెదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ ఎస్ పీ త్యాగిని విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు, పూర్తి వివరాలు  అందించకపోతే హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నా, ముడుపుల వ్యవహారంతో తమకేమీ సంబంధంలేదని అగస్టా మాతృ సంస్థ ఫిన్ మెకానికా బుకాయిస్తోంది. 

  • Loading...

More Telugu News