: తుపాను పేరు 'హెలెన్'


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఇది క్షణక్షణానికీ బలపడుతోంది. దీనికి వాతావరణ వేత్తలు 'హెలెన్' అనే పేరు పెట్టారు. ప్రస్తుతానికి ఇది కావలికి తూర్పున 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. అన్ని ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News