: ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోం: శైలజానాథ్
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోబోమని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 371-డి సవరణ అవసరం లేదన్నవారు... అటార్నీ జనరల్ ప్రకటనకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిచారు. ముందు సమస్యలను అవగాహన చేసుకోవాలని ఆయన సూచించారు. సమస్యలను పరిష్కరించి, ఆ తరువాత విభజన అంటే సమంజసంగా ఉంటుందని... వాస్తవాలను పక్కన పెట్టి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు.