: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బ్యాగ్ కలకలం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణీకుడి బ్యాగ్ కలకలం రేపింది. డిపార్చర్ వద్ద గుర్తు తెలియని బ్యాగ్ ను గుర్తించిన సిఐఎస్ఎఫ్ బలగాలు... డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టాయి. అయితే బ్యాగ్ ను తనిఖీ చేసిన భద్రతా సిబ్బంది అందులో బట్టలతో పాటు పచ్చళ్ల బాటిళ్లు మాత్రమే ఉన్నాయని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.