: భార్యతో కలిసి తాజ్ మహల్ సందర్శించిన ఆసీస్ కెప్టెన్
ఆసీస్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలవడంతో ఇంటా బయటా విమర్శలపాలైన కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఈరోజు ఆటవిడుపు తీసుకున్నాడు. భార్య కైలీతో కలిసి క్లార్క్ ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ సందర్శించాడు. ప్రేమకు సర్వోన్నత చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన తాజ్ మహల్ వద్ద క్లార్క్ దంపతులు చెట్టాపట్టాలేసుకుని నవ్వుతూ, తుళ్లుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఫొటోలకు పోజులిస్తూ ఉల్లాసంగా గడిపేశారు.