: బీజేపీ సభలు, సమావేశాలకు మైదానాలు సరిపోవడం లేదు: మోడీ
శివరాజ్ సింగ్ చౌహాన్ ను చూసి గర్వపడుతున్నామని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ నిర్వహించే సభలు, సమావేశాలకు మైదానాలు సరిపోవడం లేదని, అందుకే నగర శివారుల్లోనే సభలు నిర్వహించాల్సి వస్తోందన్నారు. ప్రజల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణ అమోఘమని చెప్పారు. బీజేపీలో ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన వారు చాలామంది ఉన్నారన్నారు. మధ్యప్రదేశ్ ను శివరాజ్ సింగ్ చౌహాన్ అభివృద్ధి పధంలో నడిపించారని కొనియాడారు.
దళితులు, గిరిజనులు అంటూ కాంగ్రెస్ నేతలు పలు హామీలు గుప్పిస్తుంటారని అన్నారు. అయినా వేలాది సంవత్సరాలుగా జీవిస్తున్న ఆదివాసీల యోజన కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని మోడీ సూచించారు. వాజ్ పేయి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను నేటికీ కొనసాగించి ఉంటే దేశం మరింత అభివృద్ధి చెంది ఉండేదని మోడీ అభిప్రాయపడ్డారు.