: లెబనాన్ లో బాంబు దాడులను తీవ్రంగా ఖండించిన అమెరికా
లెబనాన్ లో నిన్న జరిగిన రెండు బాంబు దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. బీరుట్ లోని ఇరాన్ ఎంబసీ వద్ద జరిగిన బాంబు దాడులలో 23 మంది దుర్మరణం పాలవగా, 150 మంది వరకూ గాయాలపాలయ్యారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న జీహాదీ గ్రూపు దాడులకు తామే పాల్పడ్డామని ప్రకటించింది. బాధితులు, వారి కుటుంబ సభ్యులకు నివాళి తెలియజేస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ చెప్పారు. పరిస్థితి మరింత విషమించకుండా లెబనాన్ లో అన్ని పార్టీలూ కలిసి చర్చించుకోవాలని సూచించారు. దర్యాప్తులో లెబనాన్ కు సహకారం అందిస్తామన్నారు.