: లంక నేవీ దాడులకు అడ్డుకట్ట వేయండి: ప్రధానికి జయ లేఖ


సముద్రంలో చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడులు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని జయ ప్రధానికి లేఖ రాశారు.

తాజాగా పుదుచ్చేరికి చెందిన 14 మంది మత్స్యకారులపై కాల్పులు జరిపిన లంక దళాలు వారిని అరెస్ట్ చేశాయి. గతవారం కూడా మరో 16 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ మత్స్యకారులు భారత ప్రాదేశిక జలాల్లోనే చేపలు పట్టుకుంటున్నా, లంక నేవీ దారుణంగా వ్యవహరిస్తోందని జయ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News