: 27 శాతం ట్రక్ డ్రైవర్లు మద్యం తాగి నడుపుతున్నారు


27 శాతం ట్రక్, భారీ వాహనాల డ్రైవర్లు మద్యం తాగి వాహనాలను నడుపుతున్నారు. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 26 శాతం డ్రైవర్లు పొగాకు ఉత్పత్తులను నములుతున్నామని, బీడీలు తాగుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో ఈ సర్వే జరిగింది. డ్రైవర్లు నిద్ర లేకుండా ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి రావడం, చెడు అలవాట్ల కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది.

  • Loading...

More Telugu News