: 'అమెరికా విద్యార్థులు భారత్ కు రాకపోవడానికి అత్యాచారాలే కారణం'
భారత్ లో అత్యాచారాలు పెరిగిపోవడంతో.. వ్యక్తిగత భద్రతపై ఆందోళన, మహిళలకు భద్రత లేకపోవడం వల్లే అమెరికా విద్యార్థులు భారత్ కు రావడం లేదని భారత్ లో ఆ దేశ రాయబారి నాన్సీ పావెల్ చెప్పారు. జార్ఖండ్ లోని రాంచీలో గ్జేవియర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులతో సమావేశం సందర్భంగా ఆమె పై విషయం చెప్పారు. తాము కూడా వీధుల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లు కళాశాల విద్యార్థినులు చెప్పారు. భారతీయ అమ్మాయిలకు సైతం వేధింపులు తప్పడం లేదని ఒక విద్యార్థిని పేర్కొంది.