: మేం మేం చూసుకుంటాం.. గంటాకు బాలరాజు రిటార్ట్


సీఎం విశాఖ పర్యటనకు తనను ఎవరూ ఆహ్వానించలేదని మంత్రి బాలరాజు మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తన విషయంలో సీఎం వైఖరి సరిగా లేదని అన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి 14 వ తేదీ ఉదయం తనకు సమాచారం అందించారని ఆరోపించారు. అయినా సమస్య తనకు, సీఎం కు మధ్య ఉందని, తామిద్దరం దానిపై స్పందించాల్సి వస్తే స్పందిస్తామని, మూడో మనిషి జోక్యం ఇందులో అవసరం లేదని మంత్రి గంటాకు ఘాటుగా సమాధానమిచ్చారు. చెప్పాల్సి వచ్చినప్పుడు అన్ని విషయాలూ బయటపెడతానని ఆయన అన్నారు. సంబంధం లేని వ్యక్తులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News