: అత్యంత ప్రజాదరణ గల మహిళగా సోనియా
అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (అసోచామ్), జీ న్యూస్ చానల్ తో కలిసి నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన మహిళగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు అగ్రపీఠం దక్కింది. దేశంలోనే శక్తిమంతమైన మహిళగా అత్యధికులు ఆమెకే పట్టం కట్టారు.
సోనియా తర్వాతి స్థానంలో ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చర్ ఉన్నారు. అయితే, ప్రస్తుత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న బీజేపీ నేత సుష్మా స్వరాజ్ (16), తమిళనాడు ముఖ్యమంత్రి (17), బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ (20)లకు టాప్ టెన్ లో స్థానం దక్కలేదు.