: షుగరు రోగులకు ఉపకరించే మునగ
మునగ కాయలను చక్కగా లాగించేసేవారికి కొందరికి మునగాకును కూడా తింటారని తెలియదు. చక్కటి రుచిని కలిగివుండే మునగాకులో బోలెడు పోషకాలున్నాయట. పాతకాలంలో మునగాకును మూలికా వైద్యంగా వాడేవారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇక మునక్కాయల రుచి గురించి చెప్పాల్సిన పనేలేదు.
మునక్కాయలతో బోలెడు వెరైటీలను ప్రయత్నించవచ్చు. ఘుమఘుమలాడే వంటకాలను తయారుచేయవచ్చు. మునగలో ఉండే లాభాలను గురించి చెప్పాలంటే ఇది షుగరు రోగులకు బాగా ఉపయోగపడుతుంది. మానసిక పరమైన ఆందోళనను, తలనొప్పిని, ఊపిరితిత్తుల జబ్బుల్ని తగ్గించే శక్తిని కలిగివుంటుంది. రక్తంలోని చక్కెర నిల్వలను సమతుల్యపరచడమే కాకుండా మంచి కొలెస్టరాల్‌ను పెంచి చెడు కొలెస్టరాల్‌ను తొలగించే శక్తిని కలిగివుంది. ఇన్ని సుగుణాలున్న మునగను మన వంటకాల్లో ఎక్కువగా ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండవచ్చు, రుచికి రుచీ ఆస్వాదించవచ్చు.