: ఒక్క నెల.. ప్లీజ్‌.. దూరంగా వుండండి!


ఒక్క ఛాన్స్‌.. అనే పదం మనకు చాలా పాప్యులర్‌. అయితే యూకేలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రం 'ఒక్క నెల.. ప్లీజ్‌.. ఒక్కటంటే ఒక్కటే నెల' అంటోంది. ఒక్క నెల రోజులు మీరు ఆల్కహాల్‌ జోలికి వెళ్లకుండా ఉండండి.. మీ జీవితంలో ఆరోగ్యం, జీవనశైలి, ఆదాయం అన్ని రకాలుగానూ వచ్చే తేడాను పరిశీలించి చూసుకోండి. ముందు-తర్వాత జీవితాన్ని బేరీజు వేసుకుని ఆల్కహాల్‌ సేవించే అలవాటు తగ్గించుకోవడంలో మీ నిర్ణయం మీరు తీసుకోండి అని సూచిస్తోంది ఈ సంస్థ. అందుకే వారు 'డ్రై జనవరి' అనే ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. క్రిస్‌మస్‌ తర్వాతినుంచి ఒక నెల పాటూ ఆల్కహాల్‌కు దూరంగా ఉండమనేది వీరి విజ్ఞప్తి.

యూకే కేంద్రంగా పనిచేసే చారిటీ ఆల్కహాల్‌ కన్సర్న్‌ అనే సంస్థ ఈ ప్రయత్నం చేస్తోంది. ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ప్రజలకు స్వానుభవంలోకి తీసుకురావడానికే ఇలా ప్రచారం చేస్తున్నట్లు వారు చెబుతున్నారు.

ఈ సంస్థ 2000 మందితో నిర్వహించిన సర్వే ఫలితాలను డెయిలీ మిర్రర్‌ ప్రచురించింది. వారిలో 86 శాతం మంది ఆల్కహాల్‌ వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ప్రమాదం ఉంటుందనే సంగతే తమకు తెలియదన్నట్లు చెప్పారు. అలాగే అదనంగా 66 శాతం మంది ఆల్కహాల్‌కు బోవెల్‌ క్యాన్సర్‌కు లింకుంటుందని తెలియదని చెప్పారు.

  • Loading...

More Telugu News