: రాష్ట్రం సమైక్యంగా ఉండాలి: శైలజానాథ్


రాయల తెలంగాణ వాదం కొత్తగా పుట్టిందేమీ కాదని మంత్రి శైలజానాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాల ప్రజలకు మంచిదని నమ్ముతున్నానని అన్నారు. రాయలసీమలో హంద్రీనీవా ప్రాజెక్టును అదనపు జలాల ఆధారంగా నిర్మించారని, విభజన జరిగితే నీరు ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నించారు. కలసి ఉండడం వల్ల పరస్పర అవగాహనతో నీరు అన్ని ప్రాంతాలకు అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాయల తెలంగాణ వల్ల కానీ, రాష్ట్ర విభజన వల్ల కానీ ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ అసంబద్దంగా, అసభ్యకరంగా జరుగుతోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News