: క్యాంపాకోలా ఖాళీ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ముంబైలోని క్యాంపాకోలా ప్రాంగణంలో అక్రమంగా నివసిస్తున్న వారు 31 మే 2014 లోపు ఖాళీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇల్లు ఖాళీ చేయడంపై అక్రమ నివాసదారులు ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత వారం క్యాంపాకోలా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలంటూ బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రారంభించేందుకు చేరుకోవడం... దాంతో అక్కడ రెండు రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం తెలిసిందే.