: సమాజానికి మహిళలు వెన్నెముకలాంటివారు: రోశయ్య
మహిళాదినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ రోశయ్య మహిళలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలే సమాజానికి వెన్నెముకలాంటివారని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారిపై హింస తగదని హితవు పలికారు. మహిళల విద్యాభివృద్ధితోనే సమాజం పురోగమిస్తుందని ఆయన తెలిపారు. నేటి సమాజంలో మహిళలకూ సమాన భాగస్వామ్యం కల్పించాలని రోశయ్య పిలుపునిచ్చారు.