: ముఖ్యమంత్రిని, టీఆర్ఎస్ ని కాంగ్రెస్ అధిష్ఠానమే ఆడిస్తోంది: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలను కాంగ్రెస్ అధిష్ఠానమే ఆడిస్తోందని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మండిపడ్డారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ 2008లో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి అని టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు.