: వరుసగా రెండో రోజూ సాగిన తనిఖీలు


ఓవైపు మహాశివరాత్రి పండుగ, మరోవైపు ఉగ్రవాదులు మళ్లీ పంజా విసరవచ్చని కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులకు కంటిమీద కునుకుండడంలేదు. పోలీసులకు తోడు ఆక్టోపస్ దళాలు, ఉగ్రవాద వ్యతిరేక దళాలు నగరంలో తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భద్రత ఏర్పాట్లు సరిగా లేవంటూ అబిడ్స్ లోని బిగ్ బజార్ షోరూమ్ ను మూతవేయించారు.

కాగా, భద్రత చర్యల్లో ఇవన్నీ భాగమేనని డీజీపీ దినేశ్ రెడ్డి అంటున్నారు. సినిమా ఫంక్షన్లను షరతులకు లోబడి నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అబిడ్స్ ప్రాంతంలో పోలీసు తనిఖీలను కమిషనర్ అనురాగ్ శర్మ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

  • Loading...

More Telugu News