: సచిన్ ఎంత ఎదిగినా.. ఒదిగే ఉన్నాడు: నోబెల్ విజేత డెస్మండ్ టుటూ
వినయ విధేయతల్లో సచిన్ టెండూల్కర్ అతనికతనే సాటి అని నోబెల్ విజేత డెస్మండ్ టుటూ ప్రశంసించారు. సచిన్ మానవతావాది అని ఆయన కొనియాడారు. విజయాల తాలూకు గర్వం అతనిలో కించిత్ కూడా కనిపించదని టుటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టుటూ భారత్ లో పర్యటిస్తున్నారు.
ఇక భారత సంతతి దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా ఆట సచిన్ ఆటతీరును పోలి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. టుటూ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాటం జరిపారు. ఆయనకు 1984లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.