: మిత్రులకు సచిన్ విందు.. కవిత్వం చెప్పిన యువీ!
రెండు రోజల కిందట క్రికెట్ నుంచి సెలవు తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన స్నేహితులకు, సన్నిహితులకు భారీ పార్టీ ఇచ్చాడు. నిన్న రాత్రి ముంబైలోని తూర్పు అంధేరీలో ఉన్న 'వాటర్ స్టోన్ క్లబ్'లో జరిగిన ఈ పార్టీకి క్రీడా, రాజకీయ, సినీ మిత్రులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సందీప్ పాటిల్, గంగూలీ, జవగళ్ శ్రీనాథ్, ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్, హర్భజన్, యువరాజ్ రాగా.. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ కుటుంబం, అమీర్ ఖాన్ దంపతులు, లతా మంగేష్కర్, అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, కేంద్రమంత్రి శరద్ పవార్, ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ తదితరులు విందులో పాల్గొన్నారు. సచిన్ గురువు రమాకాంత్ అచ్రేకర్ కూడా విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువరాజ్ స్వయంగా సచిన్ పై రాసుకొచ్చి చదివిన కవిత ఆహూతులందరినీ అలరించింది. హర్భజన్ మాట్లాడే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.