: సోనియాను కలిసిన మంత్రి బలరాం నాయక్
కేంద్రమంత్రి బలరాంనాయక్ ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అమె నివాసంలో కలిశారు. ఖమ్మం జిల్లా బంద్ విషయాన్ని అధినేత్రి దృష్టికి తీసుకెళ్లానని మంత్రి తెలిపారు. భద్రాచలం డివిజన్ ను తెలంగాణలోనే ఉంచాలని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఎంత ప్రధానమో.. భద్రాచలం కూడా తమకు అంతే ముఖ్యమని సోనియాకు వివరించినట్లు చెప్పారు. కాగా, రాయల తెలంగాణపై కేంద్రం, అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చారు.