: వీధి నాటకాలు ఆపండి: టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్


రచ్చబండ పేరిట ఆడుతున్న వీధి నాటకాలు కాంగ్రెస్ నేతలు ఆపాలని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ సూచించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ధర్నా చేయకుండా గల్లీలో రచ్చ చేస్తే ఏమొస్తుందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చెప్పకుండా అధికారులు జీవోఎంకు ఎలా నోటీసులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి మాటకి అధిష్ఠానం వద్ద విలువ ఉందా? అని ప్రశ్నించిన ఆయన, అధిష్ఠానం వద్ద తన మాటకు విలువలేకపోతే ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవడమే మంచిదని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News