: ముగిసిన మంత్రి వర్గ భేటీ


దాదాపు మూణ్నెల్ల తరువాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర లభించింది. కొత్త న్యాయస్థానాల ఏర్పాటు, లీజులపై సమీక్ష, కొత్త ఉద్యోగాల భర్తీ వీటిలో ముఖ్యమైనవి. భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాకుండా సీఎం జాగ్రత్త వహించినట్టు సమాచారం.

కాగా, బాంబు పేలుళ్లలో మరణించినవారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని తీర్మానించారు. క్షతగాత్రుల వైద్యానికయ్యే పూర్తి ఖర్చు భరించేందుకు నిర్ణయించారు. ఇక నానాటికీ ప్రజల్లో నిరసన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చూడాలని మంత్రులు సీఎంకు సూచించారు. 

  • Loading...

More Telugu News