: విభజన జరిగితే 371 డి ఇక వర్తించదు: వాహనవతి
రాష్ట్ర విభజన జీవోఎంకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. విభజన జరిగితే రాజ్యాంగంలోని 371 డి అధికరణ వర్తించదని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి అంటున్నారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి ఒక నివేదిక సమర్పించారు. దీని ప్రకారం విభజన జరిగితే ఇకపై 371 డి అధికరణం వర్తించదని తెలుస్తోంది. లేదు ప్రత్యేక హోదా కావాలనుకుంటే మాత్రం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో తెలంగాణ ఏర్పాటు మిగిలిన కొత్త రాష్ట్రాల డిమాండ్లకు పచ్చజెండా ఊపినట్టైంది.