: ఒక్క రోజులో 'రామ్ లీల'ను మూడుసార్లు చూసేసిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ 'గోలియోన్ కీ రాసలీల రామ్ లీల' చిత్రానికి ఫ్లాటయ్యారు. 24 గంటల్లో ఈ సినిమాను మూడుసార్లు చూశారంటేనే తెలుస్తోంది ఆయనకది ఎంతగా నచ్చిందో! అంతేకాదు, మళ్లీ మళ్లీ చూస్తారట. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ నటన అమితాబ్ ను ముగ్ధుడ్ని చేసింది. ఇందులోని పాత్రలను కూడా మెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కాగా, ఇప్పటికే 52కోట్ల రూపాయలు వసూలు చేసింది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు. అంటే ఈ చిత్రం 100 లేదా 200కోట్ల క్లబ్బులో చేరుతుందో లేదో చూడాల్సిందే.