: సచిన్ కు అభినందనలు తెలిపే తీర్మానం
క్రికెట్ చరిత్రలో అసాధారణ రికార్డులు నమోదు చేసి విశ్రమించిన సచిన్ టెండుల్కర్ కు అభినందనలు తెలియజేస్తూ బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్(చట్టసభ)లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్ ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన సచిన్ ను అభినందించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు.