: కుప్పంను ప్రశాంత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: చంద్రబాబు
పోలీస్ స్టేషన్, కోర్టు అవసరం లేని ప్రశాంతమైన నియోజకవర్గంగా కుప్పంను తీర్చి దిద్దుతానని టీడీపీ నేత చంద్రబాబు తెలిపారు. వారి భవిష్యత్, బాధ్యత తనదేనన్నారు. కుప్పం ప్రజలు స్వయం కృషితో బతికేలా చేస్తానని బాబు పేర్కొన్నారు. ఇంటింటికీ టీడీపీలో భాగంగా చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గంలో ఉన్న బాబు అక్కడి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.