: ఆడ సింహాన్ని చంపి తినేసిన మగసింహం


పురుషాధిక్య ప్రపంచం అంటుంటాం కానీ మనుషుల్లోనే కాదండోయ్.. జంతువుల్లో కూడా పురుషాధిక్యమే నడుస్తోంది. తాజాగా అమెరికాలోని డల్లాస్ జూలో ఒకే కుటుంబానికి చెందిన రెండు మగసింహాలు, మూడు ఆడ సింహాలు ఎన్నో ఏళ్లుగా కలసిమెలసి ఉంటున్నాయి. వీటి మధ్య పోట్లాటలు లేవు. అయితే ఇందులో ఓ ఆడ, మగ సింహాలు పోట్లాటకు దిగాయి. తీవ్రంగా జరిగిన ఘర్షణలో మగసింహం విసిరిన పంజా దెబ్బకు ఆడ సింహం జోహారి మృతి చెందింది. మృతి చెందిన ఆడ సింహాన్ని మగ సింహం తినేసింది. దీంతో జూ క్యూరేటర్లు షాక్ కి గురయ్యారు.

తక్షణం ఆడ సింహాలన్నింటిని మరో ప్రదేశానికి తరలించారు. ఈ సందర్భంగా జంతు సంఘం ఉపాధ్యక్షుడు వెనీ క్రమర్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా తాను జూలో విధులు నిర్వర్తిస్తున్నానని ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసలు ఘర్షణ ఎందుకు చోటుచేసుకుందో తమకు అంతుబట్టలేదని జూ క్యూరేటర్లు అంటున్నారు. ఘటన విషయం తెలిసిన తరువాత జూ సందర్శకుల సంఖ్య పెరిగిందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News