: పాలకుల అసమర్థత వల్లే ప్రజలకు ఇక్కట్లు: లోకేశ్
పాలకుల అసమర్థత వల్లే ప్రజలు ఇబ్బందులెదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ అన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వి. కోటలో పర్యటిస్తున్న ఆయన 'పల్లె పల్లెకూ తెలుగుదేశం' ప్రచార కార్యక్రమాన్నిప్రారంభించారు. అక్కడ కార్యకర్తలతో భేటీ అయిన లోకేశ్ వారికి కర్తవ్య బోధ చేశారు. ఐకమత్యంగా ఉండాలని సూచించారు. కాగా, వి.కోటలో లోకేశ్ నిర్వహించిన రోడ్ షోకి విశేష స్పందన లభించింది.