: సీఎం వ్యాఖ్యలపై మంత్రి సారయ్య ఆగ్రహం
తెలంగాణ ఇస్తే నక్సలిజం పెరుగుతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని మంత్రి సారయ్య అన్నారు. నక్సలిజం పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉందని చెప్పారు. ఏది ఏమైనా భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని మంత్రి చెప్పారు.