: రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం
ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, తుపానుల వల్ల దెబ్బతిన్న పంటలను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. ఈ ఉదయం గుంటూరు జిల్లా పెనుమాకలో వరదల వల్ల దెబ్బతిన్న ఉల్లి, పసుపు పంటలను పరిశీలించిన బృందం సభ్యులు రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రూ. 1178.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని జిల్లా యంత్రాంగం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత కేంద్ర బృందం నల్లొండ జిల్లాలో పంట నష్టం పరిశీలనకు వెళ్లింది.