: బెంగాలీ చిత్రాల్లో నటించాలని ఉంది: కరీనా
బెంగాలీ చిత్రాల్లో తనకు ఇంతవరకు అవకాశం రాలేదని, కానీ తనకు నటించాలని ఉందని బాలీవుడ్ కథానాయిక కరీనాకపూర్ చెప్పారు. తన అత్తగారు షర్మిలా టాగూర్ (సైఫ్ అలీఖాన్ తల్లి)లా తానూ బెంగాలీ చిత్ర పరిశ్రమతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని తెలిపారు. ఆమెకు ఎన్నో బెంగాలీ చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందని, తానూ పేరొందిన బెంగాలీ దర్శకులతో కలిసి పనిచేయగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.