: ట్విట్టర్లో 'థ్యాంక్ యూ సచిన్' కు 30 లక్షల ట్వీట్లు
బీసీసీఐ ట్విట్టర్లో నిర్వహించిన 'థ్యాంక్ యూ సచిన్' ప్రచారానికి 30 లక్షలకు పైగా ట్వీట్లు లభించినట్టు ట్విట్టర్ పేర్కొంది. ఇది ఒక రికార్డని తెలిపింది. సచిన్ రిటైర్మెంట్ ను పురస్కరించుకుని బీసీసీఐ కొన్నాళ్ల క్రితం డిజిగ్రాఫ్ వెబ్ సైట్ సహకారంతో సచిన్ చిత్రంపై డిజిటల్ ఆటోగ్రాఫ్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికోసం ట్విట్టర్లోనూ ఒక హాష్ ట్యాగ్ ను ఏర్పాటు చేశారు. కాగా ఆ వెబ్ సైట్ ను 40 లక్షల మందికి పైగా చూశారని, 30 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయని ట్విట్టర్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందన పట్ల సచిన్ స్పందిస్తూ తనపై చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు చెప్పాడు.