: పరస్పరం కట్టేసుకోండి


ఒకరిని వీడి మరొకరు ఉండలేమని భావించే ప్రేమికులకు, దూరంగా ఉన్న తమ జీవిత భాగస్వామికి తాను ఎప్పుడూ చేరువలో ఉండాలని భావించేవారికి, తన మనసుకు నచ్చిన స్నేహితులకు దూరంగా ఉండే భావనను తగ్గించి దగ్గరితనాన్ని పెంచేందుకు ఒక సరికొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. మనం మామూలుగా ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లను మన స్నేహితులకు కడుతుంటాం. ఇలాంటి వాటిని చూసినప్పుడు మన స్నేహితులు గుర్తుకొస్తుంటారు. అలాకాకుండా మన చేతి బ్యాండ్‌ను తడితే మన సంకేతాలను అవతలి వారికి పంపేలాంటి బ్యాండ్‌ ఉంటే... అలాంటి రిస్ట్‌ బ్యాండ్‌లను అమెరికాలోని ఒక కంపెనీ తయారుచేసింది. ఈ బ్యాండ్‌పై మనం చేతితో చిన్నగా కొట్టడం ద్వారా అవతలి వ్యక్తికి మనదైన సంకేత భాష ద్వారా సందేశాలను పంపవచ్చట.

ఇలాంటి బ్యాండ్‌ల ద్వారా అవతలి వైపునుండి కూడా ఇలాగే సంకేతాల ద్వారా సమాధానాలను కూడా పొందవచ్చని కంపెనీ వారు చెబుతున్నారు. ఈ బ్యాండ్‌ ప్రకంపనలు నిరంతరం మనం ఒకరితో ఒకరు కలసి ఉంటున్నామనే భావనకు కారణమవుతాయని దీని రూపకర్తలు చెబుతున్నారు. ట్యాప్‌... ట్యాప్‌ అని పేరుపెట్టిన ఈ కొత్తరకం సిలికాన్‌ బ్యాండ్లులో అత్యాధునిక సెన్సర్‌ ఉంటుంది. దీనిపై టక్‌టక్‌మని చిన్నగా చప్పుడు చేస్తే అవి గ్రహిస్తాయి. అవతలి వ్యక్తికి వాటిని కచ్చితంగా చేరవేసి సమాధానాన్ని స్వీకరిస్తాయి. అయితే ఈ బ్యాండ్లను ఉపయోగించుకోవాలనుకున్నవారు ప్రత్యేకమైన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దానిని తమ ఈ-మెయిల్‌కు, తమ భాగస్వామి ఈ-మెయిల్‌కు అనుసంధానించాలి. ఇక సంకేతాల రూపంలో సందేశాలను నిరంతరాయంగా పంపించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News