: ఇండియా సెంటర్‌ ఫర్‌ షుగర్‌ పేషెంట్స్‌!


మనదేశంలో షుగరు రోగులు రోజు రోజుకూ పెరిగిపోతున్నారట. భారతదేశం షుగరురోగులకు, గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడేవారికి రాజధానిగా మారిపోతోందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2020 నాటికి దేశంలో రోజూ సంభవించే మరణాల్లో ఎక్కువమంది గుండెకు సంబంధించిన రోగులే ఉంటారని వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ కార్డియాలజీ హెచ్చరించింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్‌ నిపుణురాలు నమిత జైన్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనదేశంలో ఎక్కువమంది షుగరు, గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతున్నారని ఆమె అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్లమందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, ఇందులో ఐదు కోట్లమంది భారతీయులేనని అన్నారు. గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడేవారిలో ఎక్కువగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారని, ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతోందని నమిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యపు అలవాట్లు మార్చుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని, సిగరెట్‌ మానేయడం, తగినంతగా వ్యాయామం చేయడం, మంచి ఆహారపు అలవాట్లతోబాటు తగినంతగా నిద్రపోవడం వంటివి చేయడం వల్ల ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఆమె చెబుతున్నారు.

  • Loading...

More Telugu News