: నిప్పును కప్పిన మంచు!


నిప్పును మంచు కప్పడమేంటి... అసలు మంచు పడితేనే నిప్పు ఆరిపోతుంది కదా అనుకుంటున్నారా? అంటే ఇక్కడ నిప్పు అంటే అగ్ని పర్వతం. నిప్పుకన్నా వేడిఎక్కువగా ఉండేది. ఎముకలను కూడా గడ్డకట్టించే మంచు కొండల్లో పొగలుకక్కే అగ్నిపర్వతం దాగివుందట. ఇంతకాలంగా వెలుగులోకి రాని ఈ అగ్నిపర్వతాన్ని ఇప్పుడు గుర్తించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.

పెద్ద మంచుఖండం అంటార్కిటికాలో అంతర్గతంగా దాగివున్న అగ్నిపర్వతం ఇటీవల వెలుగుచూసింది. పశ్చిమ ప్రాంతంలోని మంచు పలకల కింద సుమారు కిలోమీటరు లోతులో ఇన్నాళ్లుగా కనిపించకుండా దాగివున్న అగ్నిపర్వతం పొగలు కక్కుతూ బయటపడింది. దీని సమీపంలో రెండు చోట్ల ఏర్పాటు చేసిన భూకంపలేఖినులు జనవరి 2010, మార్చి 2011 మధ్యకాలంలో పలుమార్లు అక్కడ ప్రకంపనాలను గుర్తించాయి. అలాగే అక్కడి మంచు చరియల నుండి అసాధారణంగా సన్నని పొగరావడం, మంచు కరిగిపోవడాన్ని భూ, అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాన్ని గురించి వాషింగ్టన్‌ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు మాట్లాడుతూ మంచు పొరలకింద అగ్నిపర్వతం బద్దలై శిలాద్రవం వచ్చి చేరుతున్నట్టు చెబుతున్నారు. కొత్తగా గుర్తించిన ఈ అగ్నిపర్వతానికి ఇంకా పేరుపెట్టలేదు.

  • Loading...

More Telugu News