: ఈ డాక్టర్లు మంచివాళ్లు


మనకు రోడ్డుపై తాబేలు కనిపించిందనుకోండి, వెంటనే ఏం చేస్తాము... నాన్‌వెజ్‌ తినేవాళ్లయితే వెంటనే పట్టి సంచిలో పెట్టేసుకుని ఇంటికి వెళ్లి చక్కగా కూరవండుకుని లాగించేస్తారు. లేదా పెంచుకోవాలనే ఇష్టం ఉండేవాళ్లయితే తీసుకెళ్లి పెంచుకుంటారు. అలాకాకుండా దొరికిన తాబేలు కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉంటే మొదటి రకం వారికి ఎలా వున్నా ఓకే... రెండవ రకం వారు అయ్యో పాపం అనుకుని వెళ్లిపోతారేమో. కానీ కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్న ఒక బుల్లి తాబేలుకు డాక్టర్లు చక్కగా వైద్యం చేశారు. విరిగిన కాలు స్థానంలో తాబేలుకు చక్కగా చక్రాలు అమర్చారు.

అసలే బుల్లి తాబేలు. దానికి కాలు విరిగింది. అదే మనకైతే విరిగిన కాలు బాగుచేయడానికి రాడ్డో లేదా మరేదైనా వేసి కట్టుకట్టి బాగా నడిచేలా చేస్తారు. కాలు మొత్తం తీసేయాల్సి వచ్చినప్పుడు చక్కగా జైపూర్‌ కాలు అమరుస్తారు. కానీ ఈ కాలు విరిగిన తాబేలుకు డాక్టర్లు లెగో వీల్‌ను అమర్చారు. రెండు చక్రాలను తాబేలు కాలుకు అమర్చారు. ఈ రెండు చక్రాలతో అది మలుపుల్లో, మూలల్లో సరిగా తిరగలేకపోతుండడాన్ని గమనించి ఒక చక్రాన్ని తీసేశారు. ఇప్పుడు ఆ తాబేలుగారు చక్కగా చక్రం కాలుతో జామ్మని నడిచేస్తోందట.

  • Loading...

More Telugu News