: గుండె పట్టేసినపుడు ఇలా చేస్తే...


కొందరికి హఠాత్తుగా గుండె కొట్టుకోవడం స్తంభించిపోతుంది. ఇలాంటి వారికి హృదయం, ఊపిరితిత్తుల పునరుజ్జీవన చర్య (సీపీఆర్‌) చేస్తే రోగి బతికే అవకాశాలున్నాయని పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. సాధారణంగా గుండె స్తంభించినపుడు (కార్డియాక్‌ అరెస్ట్‌) రోగి బతికే శాతం తక్కువనే చెప్పాలి. కేవలం పది శాతం మంది మాత్రమే బతుకుతారు. ఇలాంటి వారికి 38 నిముషాల పాటు సీపీఆర్‌ చేసినట్టయితే రోగి బతికే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జపాన్‌లో 2005-11 మధ్య కాలంలో కార్డియాక్‌ అరెస్టుకు గురైన కొందరిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో గుండె ఆగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించిన వారిలో ఆ వ్యవధి ఎంతసేపుంది అనేదాని ఆధారంగా అది వారి మెదడు పనితీరుపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేశారు. వీరు చేసిన అధ్యయనం ప్రకారం మొత్తం 38 నిమిషాలు అంతకంటే ఎక్కువ సమయం సీపీఆర్‌ చేసినట్టయితే మంచిదని ఈ పరిశోధనల్లో పాల్గొన్న టోక్యోలోని సీపీఆర్‌-కార్డియో వాస్కులర్‌ కేర్‌ ముఖ్య సంచాలకుడు కెన్‌ నగావో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News