: కాలేయ సమస్యలకు మద్యపానమే కారణం


కాలేయ సంబంధితమైన అనేక రకాల ఆరోగ్య సమస్యలకు మద్యపానమే మూలకారణంగా ఉంటోందని శాస్త్రవేత్తలు నిర్ధరిస్తున్నారు. మద్యపానం పట్ల జనం ఎగబడే పరిస్థితిని తగ్గించాలని, వినియోగం పట్ల నియంత్రణలు ఉండాలని వారు సూచిస్తున్నారు. ఆల్కహాల్‌ ద్వారా వచ్చే కాలేయ సమస్యల గురించి భారత్‌లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నదని, ఈ రంగంలో ఇంకా పరిశోధనలు సాగాల్సి ఉందని, అలాగే లిక్కర్‌ ధరలను కూడా పెంచాలని వారు సూచిస్తున్నారు. న్యూఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలైయరీ సైన్సెస్‌ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఈ అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆల్కహాల్‌ ధరలు బాగా పెంచి, ప్రజలు వాటి వినియోగం తగ్గించేలా చూడాలని యూకేలోని హెపటాలజీ ఇంపీరియల్‌ కాలేజికి చెందిన ప్రొఫెసర్‌ మార్క్‌ తుజ్‌ చెబుతున్నారు.

యూకేలో మృత్యుకారకమైన వ్యాధుల్లో ఈ ఆల్కహాల్‌ సంబంధిత కాలేయ సమస్యలు టాప్‌ 5 లో ఉన్నాయి. శోచనీయం ఏంటంటే.. టాప్‌ 4లో ఉన్న వ్యాధులు తగ్గుముఖం పడుతుండగా, ఇవి మాత్రం పెరుగుతున్నాయి.

మద్యపానాన్ని నిషేధించడం సమాజంలో నేరాలు పెరగడానికి కారణం అవుతుందని, అలాకాకుండా వాటిమీద ప్రకటనల్ని నిషేధించాలని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News