: సినిమా టైటిల్స్ లో ఇకపై కథానాయిక పేరే ముందు వేస్తానంటున్న షారుఖ్


పురుషుని కంటే స్త్రీ తక్కువనే భావన తొలగించేందుకు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నడుం బిగించాడు. ఇందులో భాగంగా, ఇక నుంచీ తను నటించే సినిమా టైటిల్స్ లో హీరో పేరు కంటే హీరోయిన్ పేరు ముందు వస్తుందని ప్రకటించాడు. తన తాజా నిర్ణయంతో సమూల మార్పులు రాకపోయినా, పురుషుల ఆలోచనా విధానంలో కొంత సంస్కరణ వచ్చే అవకాశముందని షారుఖ్ అన్నాడు.

స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేననీ, ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అనే ఆలోచన సమంజసం కాదని షారూఖ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తానూ చేస్తున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమా టైటిల్స్ లో తన పేరు కంటే ముందుగా కథానాయిక దీపికా పదుకొనే పేరే వస్తుందన్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా తాను తీసుకున్న నిర్ణయమిదని షారూఖ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News